తనయుడు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా బ్లాక్ బస్టర్ అని మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు. ఆయన అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత గేమ్ ఛేంజర్ మీద బజ్ బాగా పెరిగింది. విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాబోతున్నారు. దిల్ రాజు పవన్ కళ్యాణ్ ను కలిసి గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు రావాలని ఆహ్వానించారు. చరణ్ మూవీ ఫంక్షన్ కు రమ్మంటే రాకుండా ఉంటారా.. వస్తానన్నారు. ఈ వేడుక చరిత్ర సృష్టించాలి అని దిల్ రాజు అనడంతో ఎలా చేయనున్నారు అనేది మరింతగా ఆసక్తి కలిగిస్తోంది.
మరోవైపు చిరంజీవి గేమ్ ఛేంజర్ మూవీ చూసి బ్లాక్ బస్టర్ అని చెప్పారు. ఆయన జడ్జిమెంట్ ఎప్పుడూ మిస్ అవ్వదు. ఆయన ఏదైనా చెప్పారంటే.. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒకటి రెండు సార్లు జడ్జెమెంట్ మిస్ అయ్యిందేమో కానీ.. చాలా వరకు నిజమయ్యింది. అందుకనే ఇప్పుడు గేమ్ ఛేంజర్ గురించి మెగాస్టార్ చెప్పినట్టుగా బ్లాక్ బస్టర్ అవుతుందని టాక్ బలంగా వినిపిస్తోంది. చిరు స్టేట్ మెంట్ తో ఇప్పటి వరకు రాని బజ్ మరింతగా వచ్చింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తే.. ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఇంకా పెరుగుతాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీ ఇది. మరి.. చిరు జోస్యం ఎంత వరకు పలిస్తుందో చూడాలి.