పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంటే.. కీలక పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. అయితే.. ఇందులో యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ నటిస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి ఆయన పాత్ర ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. విలన్ పాత్ర అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు విలన్ పాత్ర చేయడం నిజమే అని తెలిసింది. అయితే.. కమల్ పాత్రకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
అది ఏంటంటే… కమల్ విలనిజం అత్యంత భయంకరంగా ఉంటుందట. ఈ ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలి అనే కోరికతో రగిలిపోయే స్వార్థపరుడిగా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. తొలిసారిగా కమల్ పూర్తి స్థాయిలో విలన్ గా నటిస్తుండడంతో ఇది ఒకరకంగా సవాలే. ఇందులో కమల్ ఏ రేంజ్ లో విజృంభిస్తాడనేది తెర పై చూడాలి. సంక్రాంతికి రావాలి అనుకున్న ప్రాజెక్ట్ కి సమ్మర్ కి వస్తుందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. మరి.. ఈ పాన్ వరల్డ్ మూవీ చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.