“దేవర” మళ్లీ వాయిదా పడనుందా..?

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తోన్న భారీ, క్రేజీ మూవీ దేవర. కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 5న రావాల్సిన దేవర అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఆతర్వాత సెప్టెంబర్ 27కి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే.. ఇంకా ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది. మరి.. దేవర ఈసారైనా అనౌన్స్ చేసిన డేట్ కి వస్తుందా.? వాయిదా పడనుందా..? అసలు ఏం జరుగుతోంది..?

ఇంతకీ విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ ఓ వైపు దేవర షూటింగ్ చేస్తూ.. మరో వైపు వార్ 2 షూటింగ్ కూడా చేస్తున్నారు. ఒక వారం రోజులు దేవర షూటింగ్ లో ఉంటే.. మరో వారం రోజులు వార్ 2 షూటింగ్ లో ఉంటున్నారు. ఇలా రెండు సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ చేతికి గాయం అయ్యింది. జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా ఎడమ చేతి మణికట్టుకు గాయం అయ్యింది. దీని పై ఎన్టీఆర్ టీమ్ అఫిషియల్ గా క్లారిటీ కూడా ఇచ్చింది. గాయం అయినప్పటికీ ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో పాల్గొన్నారు. రెండు వారాల్లో కట్టు తీసేస్తారని.. త్వరలోనే ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అవుతారని ప్రకటించారు.

ఎన్టీఆర్ కు గాయం అయిన కారణంగా వార్ 2 షూటింగ్ ను క్యాన్సిల్ చేశారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక దేవర విషయానికి వస్తే.. ఎన్టీఆర్ లేకుండా తీయాల్సిన సీన్స్ ను అల్యూమినియం ప్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు. ఇంకా నెల రోజుల్లో దేవర రిలీజ్. ఇంకా షూటింగ్ జరుగుతుండడంతో సెప్టెంబర్ 27న దేవర వస్తుందా..? వాయిదా పడనుందా..? అనే ప్రచారం జరుగుతుంది. అయితే.. ఎన్టీఆర్ షూట్ మొత్తం కంప్లీట్ అయ్యిందని.. ప్యాచ్ వర్క్ జరుగుతుందని.. అనుకున్న ప్రకారమే దేవర సెప్టెంబర్ 27న వస్తుందని సమాచారం. మరి.. దేవర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.