పవన్ బర్త్ డేకు “ఉస్తాద్..” ట్రీట్ ఉంటుంది – నిర్మాత రవిశంకర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్(Hareesh shankar) రూపొందిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే ప్రశ్నకు జవాబు చెప్పారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్(Producer ravishankar). పవన్ రాజకీయంగా బిజీగా మారిన నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagatsingh) సినిమా ఉండకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.

పవన్ పొలిటికల్ బిజీ చూస్తుంటే ఇది నిజమేనని అనుకోవచ్చు. అయితే ప్రొడ్యూసర్ ర‌విశంకర్ మాత్రం డిసెంబర్, జనవరి కల్లా ఉస్తాద్ షూటింగ్ కంప్లీట్ చేస్తామని సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజున ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ట్రీట్ ఖచ్చితంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇక పవన్ కల్యాణ్ స్మగ్లింగ్ గురించి చెప్పింది పుష్ప 2(Pushpa 2) గురించి కాదని రవిశంకర్ చెప్పే ప్రయత్నం చేశారు.