చిరు నెక్ట్స్ మూవీ మరింత ఆలస్యం కానుందా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు భోళాశంకర్ అంతకు మించిన డిజాస్టర్ గా నిలిచింది. పుల్ రన్ లో పాతిక కోట్ల షేర్ కూడా రాబట్టడం కష్టమౌతుంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ప్లాప్ అయ్యిందని తెలిసిన వెంటనే చిరు ఢిల్లీ వెళ్లారని వార్తలు వచ్చాయి. పుట్టినరోజుకు కూడా చిరు హైదరాబాద్ లో ఉండడం లేదట. ఇంతకీ విషయం ఏంటంటే.. కొంతకాలంగా చిరు మోకాలి నొప్పితో బాధపడుతున్నారట. దీనికి ఆపరేషన్ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యారట.

ఇది ఢిల్లీలో కానీ.. బెంగుళూరులో కానీ చేయించుకోనున్నారని సమాచారం. ఇదే కనుక జరిగితే.. చిరుకు రెండు నెలలు విశ్రాంతి అవసరం. అందుచేత కళ్యాణ్ కృష్ణతో చేయాలనుకున్న సినిమా మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ చిత్రాన్ని చిరు డాటర్ సుస్మిత నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. చిరు బర్త్ డేకు ప్రకటించాలి అనుకున్నారు. ఇప్పుడు చిరు పుట్టినరోజుకు ప్రకటించినా.. సెట్స్ పైకి వెళ్లడానికి టైమ్ పట్టచ్చు అని టాక్ వినిపిస్తోంది. మరో వైపు ఈ రెండు నెలలో ఎలాంటి సినిమాలు చేయాలనేది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. మొత్తానికి భోళాశంకర్ చిరును ఆలోచనలో పడేసింది అన్నమాట.