రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రా అండ్ రస్టిక్ గా చరణ్ కొత్త సినిమా ఉంటుందని ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా సినిమా ఇదని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడని గతంలో వార్తలొచ్చాయి. డైరెక్టర్ బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెనలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి యాక్టింగ్ సినిమాకు ఆకర్షణ అయ్యింది. అందుకే రామ్ చరణ్ సినిమాలోనూ ఆయనను విలన్ గా తీసుకున్నారని టాక్ వచ్చింది. ఇందులో నిజం లేదని తెలుస్తోంది.
ఇదే కాదు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కూడా నిజం కాదట. ఈ విషయాన్ని యూనిట్ మెంబర్ ఒకరు మీడియాతో షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.