మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్. భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో చిరుకు జంటగా మిల్కీబ్యూటీ నటిస్తుంటే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇందులో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ గెస్ట్ రోల్ చేస్తుండడం విశేషం.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. చిరంజీవి డబ్బింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. అయితే.. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించారు. అందుకనే ఆ సినిమా అంతలా అందరికీ కనెక్ట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనిని దృష్టిలో పెట్టుకుని భోళా శంకర్ మూవీని కూడా అభిమానులు కోరుకునే విధంగా రూపొందించారట. అందుకనే భోళా శంకర్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని టాక్ వినిపిస్తుంది.