భగవంత్ కేసరి కంటే ముందు బాలయ్య మరో సినిమా వస్తుందా..?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా కాజల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం విశేషం. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయనున్నారు. అక్టోబర్ 19న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా ఇటీవల అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. భగవంత్ కేసరి సినిమా కంటే ముందుగా బాలయ్య నుంచి మరో సినిమా రిలీజ్ కానుంది.

ఇంతకీ ఏ సినిమా అంటే.. బాలయ్య కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి భైరవద్వీపం. ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇప్పటికీ కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగష్టు 5న భైరవద్వీపం చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
దీనితో ఈ విజువల్ అండ్ వింటేజ్ ఫాంటసీ వండర్ ని ఇన్ని రోజులు టీవీల్లోనే చూసి ఎగ్జైట్ అయ్యినవారు థియేటర్స్ లో చూడాలి అనుకుంటే ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పాలి. మరి.. భైరవద్వీపం ఇప్పుడు ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.