బాలకృష్ణ, వెంకటేష్ కాంబో మూవీ సాధ్యమేనా

బాలకృష్ణ, వెంకటేష్ కాంబోలో భారీ మల్టీస్టారర్ సినిమా రానుందని టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ టాక్ షోలో వెంకీ పాల్గొన్నారు. బాలకృష్ణ, వెంకటేష్ మాటల మధ్యలో ఇద్దరూ కలిసి సినిమా చేయడం గురించి ప్రస్తావన వచ్చింది. అయితే.. ఈ క్రేజీ కాంబో మల్టీస్టారర్ ను తను డైరెక్ట్ చేస్తానని సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పాడని సమాచారం.

అనిల్ రావిపూడి అటు బాలకృష్ణ, ఇటు వెంకటేష్ ఇద్దరితో సినిమాలు చేశాడు. అందుచేత ఇద్దర్ని ఎలా చూపించాలో తనకు క్లారిటీ ఉంటుంది. అందుచేత అతను అనుకుంటే.. ఈ క్రేజీ మల్టీస్టారర్ సెట్ అవ్వచ్చు. చూడాలి మరి.. ఈ క్రేజీ మల్టీస్టారర్ మాటలకే పరిమితం అవుతుందో.. లేక నిజంగానే సెట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం వెంకటేష్ తన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుండగా, బాలకృష్ణ డాకు మహారాజ్ తో సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతున్నాడు.