యానిమల్ వాయిదా నిజంగా పడుతుందా..?

అర్జున్ రెడ్డి సినిమా ఓ సంచలనం. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండకు యూత్ మాంచి క్రేజ్ వచ్చింది. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకు కూడా మాంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా సక్సెస్ అవ్వడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకు వరుసగా భారీ ఆపర్స్ వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కఫూర్ తో యానిమల్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో రణ్ బీర్ కు జంటగా క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. టీ సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

అయితే.. సన్ని డియోల్, అమీషా పటేల్ నటిస్తున్న గదర్ 2 చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్నారు. అందుచేత ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏర్పడుతుంది కాబట్టి యానిమల్ చిత్రాన్ని వాయిదా వేయనున్నారని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. యానిమల్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కి రెడీ అవుతుంది. తెలుగులో ఆగష్టు 11న చిరంజీవి భోళా శంకర్ రిలీజ్ కానుంది. అందుచేత ప్రచారంలో ఉన్నట్టుగా యానిమల్ మూవీ వాయిదా పడుతుంది అనుకున్నారు కానీ.. ఇందులో వాస్తవం లేదని బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. సో… యానిమల్ ఆగష్టు 11న రావడం ఖాయం.