త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సోషియో ఫాంటసీ మూవీ?

దర్శకుడు త్రివిక్రమ్ హీరో అల్లు అర్జున్ ది టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్. త్రివిక్రమ్ పెన్ పవర్, అల్లు అర్జున్ యాక్టింగ్ ఎనర్జీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. జులాయి, సన్నాఫ్ కృష్ణమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు వీరి కాంబో సత్తా చాటాయి. ఇప్పుడు నాలుగో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను కొద్ది రోజుల కిందట అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట త్రివిక్రమ్.

ఈ ప్రాజెక్ట్ గురించి తెలుస్తున్న సమాచారం ప్రకారం సోషియో ఫాంటసీ కథతో సినిమా ఉంటుందట. పీరియాడిక్ డ్రామా కథలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ జోడిస్తూ ఒక ఇంట్రెస్టింగ్ లైన్ త్రివిక్రమ్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో సీజీ వర్క్ కు ఇంపార్టెన్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. గతంలో వీరి కాంబినేషన్ లో ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్స్ రాగా..ఇది కొత్త జానర్ లో ప్రయత్నిస్తున్నారు.

గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ చేస్తుండగా..త్రివిక్రమ్ మహేశ్ హీరోగా గుంటూరు కారం సినిమాను రూపొందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఇద్దరూ తమ కొత్త ప్రాజెక్ట్ పనులు ప్రారంభించబోతున్నారు.