అకిరాతో “ఖుషి 2” ?

పవర్ స్టార్ వారసుడు అకిరా నందన్ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? అంటే అదంతా తనిష్టమని రేణు దేశాయ్ ఎప్పుడో చెప్పారు. కాకపోతే అకిరాకు మ్యూజిక్ అంటే ఇష్టమని.. చెప్పడంతో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఈమధ్య పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అకిరాను చంద్రబాబుకు, మోదీకి పరిచయం చేశారు. దీంతో ఒక్కసారిగా అకిరా పాన్ ఇండియా రేంజ్ లో వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు అకిరా. రేణుదేశాయ్ ని అకిరా గురించి అడిగితే.. తను కూడా అకిరా ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని చెప్పారు.

ఈవిధంగా అకిరా ఎంట్రీకి రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చెబుతున్నారు.. అంతా అకిరా ఇష్టమని. ఇక ఇప్పుడు అంతా అకిరా చేతుల్లోనే ఉంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఎస్.జె. సూర్య గేమ్ ఛేంజర్ మూవీలో విలన్ గా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఖుషి 2 గురించి అడిగితే.. ఇప్పుడు దృష్టి అంతా నటన పైనే ఉందన్నారు. అయితే.. అకిరా చేస్తానంటే.. ఖుషి 2 అకిరాతో చేస్తానన్నారు ఎస్.జె.సూర్య. అంతే కాకుండా ఇటీవల అకిరాను చూశానని.. పవన్ కళ్యాణ్ వలే ఇప్పటి నుంచే పుస్తకాలు చదువుతున్నాడని.. చెప్పారు. సూర్య ఇలా చెప్పడంతో ఖుషి 2 మరోసారి తెర పైకి వచ్చింది.