కుట్రతోనే కేసు పెట్టించారు – నివీన్ పాలీ

తనను వేధింపులకు గురిచేశాడంటూ ఓ అమ్మాయి మలయళ స్టార్ హీరో నివీన్ పాలి(Nivin pauly)పై కేసు పెట్టింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుపై స్పందించారు హీరో నవీన్ పాలీ. కుట్రతోనే కావాలనే ఈ కేసు తనపై పెట్టించారని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. చట్టపరంగానే ఈ కేసును ఎదుర్కొని, తాను నిర్దోషినని నిరూపించుకుంటానని నవీన్ పాలీ అన్నారు.

నవీన్ పాలీ మాట్లాడుతూ- కేసు పెట్టిన అమ్మాయి ఎవరో తెలియదు. దుబాయ్ లో ఆడిషన్ లో నేను ఆమెను వేధించినట్లు కేసు పెట్టింది. అసలు మేము దుబాయ్ లో ఆడిషన్ నిర్వహించలేదు. గతంలోనూ ఇదే అమ్మాయి నాపై పోలీస్ కేసు పెట్టింది. ఆ కేసులో వాస్తవం లేదని పోలీసులు కేసు కొట్టేశారు. ఇప్పుడీ కేసు కూడా కుట్రపూరితంగా పెట్టిందే. చట్టపరంగా ఎదుర్కొంటా. అని అన్నారు. నినీన్ పాలీపై వేధింపుల కేసు నమోదు కావడం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది.