పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో రూపొందిన చిత్రం బ్రో. సముద్రఖని తెరకెక్కించిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే.. ఈ వేడుకకు చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు కానీ.. ఇద్దరు రాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరు రాలేదు అనగానే.. పవన్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్, పవన్ భక్తుడు బండ్ల గణేష్ అనుకుంటే పొరపాటే. వీళ్లిద్దరూ రాకపోవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. మరి.. వీరిద్దరూ కాకుండా ఇంకో ఇద్దరు ఎవరనుకుంటున్నారా..? హరీష్ శంకర్, క్రిష్.
పవన్ తో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు. క్రిష్ హరిహర వీరమల్లు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. మరో వైపు రెండేళ్ళ నుంచి హరిహర వీరమల్లు సినిమాని క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఈ మూవీకి మరో 30 నుంచి 40 రోజులు కాల్ షీట్స్ కేటాయిస్తే షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అయితే దానికి ప్రయారిటీ ఇవ్వకుండా పవన్ బ్రో మూవీ కంప్లీట్ చేశారు. అలాగే సుజిత్ దర్శకత్వంలో ఒజీ సినిమా కోసం డేట్స్ కేటాయించారు. ఈ విషయంలో క్రిష్ కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. అందుకనే వీరిద్దరూ బ్రో వేడుకకు రాలేదని టాక్.