డైరెక్టర్ బాబీ తనదైన స్టైల్లో సినిమాలు తీస్తూ..గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు డాకు మహారాజ్ అనే సినిమా తీస్తున్నాడు. అయితే.. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో తనను ఓ సినిమా నిర్మాణంలో చాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు. దీంతో బాబీని ఇబ్బంది పెట్టింది ఎవరు..? అనేది ఇటు ఇండస్ట్రీలో, అటు అభిమానుల్లో టాపిక్ అయ్యింది. గతంలో తాను తీసిన ఒక సినిమా విషయంలో ప్రొడక్షన్ హౌస్ వల్ల ఇబ్బందులు పడ్డానని బాబీ చెప్పాడు.
బాబీ ఆ సినిమా పేరు చెప్పలేదు కానీ.. అది హిట్ అయినప్పటికీ, ఇంకా పెద్ద రేంజికి వెళ్లాల్సిన సినిమా అని చెప్పాడు. తాను కోరుకున్న బడ్జెట్ ఇచ్చి, ఇంకా గ్రాండ్‌గా సినిమా తీసి ఉంటే దాని రేంజే వేరుగా ఉండేదన్నాడు. దీంతో బాబీ ఏ సినిమా గురించి అలా మాట్లాడాడు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే.. ఇందు కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కనిపించడం లేదు. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే.. ఆ సినిమా జై లవకుశ అని తేల్చేస్తున్నారు. కారణం ఏంటంటే.. కళ్యాణ్ రామ్ ఏమో గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో పోల్చాడీ సినిమాను. సినిమాలో ఆ స్థాయి క్వాలిటీ కనిపించలేదు. అందుకనే బాబీ బాధలో తప్పేమీ లేదు అంటున్నారు. మరి.. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ విషయం పై స్పందిస్తుందేమో చూడాలి.