మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం బ్రో సినిమా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న బ్రో చిత్రాన్ని సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. జులై 28న బ్రో సినిమా రిలీజ్ కానుంది. ఇక బ్రో సినిమా తర్వాత తేజ్ ఎవరితో సినిమా చేయనున్నాడు అటే.. సంపత్ నంది పేరు వినిపిస్తుంది. ఈసారి తేజ్ పక్కా మాస్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ చిత్రానికి గాంజా శంకర్ అనే టైటిల్ ఖరారు చేశారని టాక్ వినిపిస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. జులైలో షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అందుచేత ఇప్పుడు కథానాయిక వేట మొదలెట్టింది చిత్ర బృందం. సంపత్ నంది సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కువగా స్టార్ హీరోయిన్లకే ఆయన తన సినిమాల్లో చోటిస్తుంటారు. ఈసారీ అదే ఫార్ములా పాటిస్తున్నారు. గాంజా శంకర్‌కి జంటగా పూజా హేగ్డే లేదా శ్రీలీలను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. వీరిద్దరికీ స్టోరీ చెప్పారట. ఇద్దరిలో ఎవరి డేట్స్ సెట్ అయితే.. వాళ్లను గాంజా శంకర్ కు జంటగా నటిస్తారు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తారు.