సంక్రాంతి సినిమాల్లో ఏ ట్రైలర్ బాగా రీచ్ అయ్యింది

ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్‌ సంక్రాంతికి వస్తున్నాం. రిలీజ్ డేట్స్ దగ్గర పడడంతో.. ఈ మూడు చిత్రాల మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఈ సంక్రాంతి సినిమాల ట్రైలర్స్ రిలీజ్ చేశారు. మరి.. ఈ మూడు సినిమాల ట్రైలర్స్ లో ఏది హిట్టైంది..? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ముందుగా రిలీజైన ట్రైలర్ గేమ్ ఛేంజర్ మూవీది. రామ్ చ‌ర‌ణ్, డైరెక్టర్ శంక‌ర్ కాంబోలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో శంక‌ర్ మార్క్ ఈ ట్రైల‌ర్ లో స్ప‌ష్టంగా క‌నిపించింది. విజువ‌ల్స్ బాగున్నాయి. చ‌ర‌ణ్ లుక్ ఆకట్టుకుంది. కొన్ని షాట్స్‌ నిజంగా సిల్వర్ స్క్రీన్స్ పై చూస్తే విజిల్స్ వేసేలా క‌నిపిస్తున్నాయి. అలాగే థమన్ బీజిఎం బాగుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత గేమ్ ఛేంజర్ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది.

ఈ సంక్రాంతికి వస్తోన్న సినిమాల్లో మరో చిత్రం డాకు మహారాజ్. ఇదేదో కొండవీటి దొంగ తరహా సినిమా అనే ఫీలింగ్ క్రియేట్ చేసింది కానీ.. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్ర‌పంచం సృష్టించాడు బాబీ అని చెబుతున్నారు. ట్రైల‌ర్‌లో బాలకృష్ణ పాత్ర‌ల్లోని వేరియేష‌న్స్ బాగా చూపించారు. స్టైలీష్‌గా క‌ట్ చేసిన ట్రైల‌ర్ ఇది. బాల‌కృష్ణ ట్రైల‌ర్ అన‌గానే.. ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు ఉంటాయి. ఈసారి వాటి జోలికి పోలేదు. అయినా స‌రే.. హీరోయిజం త‌గ్గ‌లేదు. బాలకృష్ణ సినిమా ట్రైలర్ లో డైలాగులు లేకపోవడం కాస్త కొత్తగా ఉంది. అలాగే పవర్ ఫుల్ డైలాగ్స్ లేవేంటి అనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ ట్రైల‌ర్ డాకూ మ‌హారాజ్‌ పై ఉన్న అంచ‌నాల్ని పెంచ‌లేదు.. అలాగ‌ని త‌గ్గించ‌నూ లేదు. పండక్కి రిలీజ్ అవుతున్న మ‌రో సినిమా సంక్రాంతికి వ‌స్తున్నాం. వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో ఫస్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. వెంకీ స్టైల్ ఆఫ్ కామెడీ, ఆయ‌న మేన‌రిజం, ఫ‌స్ట్రేష‌న్ బాగా చూపించారు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు మా థియేట‌ర్ల‌కు రావొచ్చు అనే న‌మ్మ‌కాన్ని ఈ ట్రైల‌ర్ క‌ల్పించింది. సో.. సంక్రాంతికి వస్తోన్న మూడు సినిమాల ట్రైలర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి.