ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, బ్రో.. ఇలా ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చారు. కెరీర్ లోనే ఇలా నాలుగు సినిమాలు ఓకేసారి చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఇటీవల బ్రో సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈరోజు నుంచి ఓజీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రాన్ని అక్టోబర్ కి పూర్తి చేయాలి.. ఈ భారీ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలి అనేది ప్లాన్.

అయితే.. ఉస్తాద్ భగత్ సింగ్ తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ చేయనున్నట్టుగా ఇటీవల ప్రకటించారు కానీ.. ఈ నెల 14 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర స్టార్ట్ చేయనున్నారు. ఈ యాత్రతో పవన్ పొలిటికల్ గా బిజీ కానున్నారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ తాజా షెడ్యూల్ ఎప్పుడు అనేది సస్పెన్స్ లో పడింది. హరీష్ శంకర్ ఈ మూవీని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో మరింత కసితో.. మరింత ఉత్సాహంతో ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ తాజా షెడ్యూల్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.