హిట్ రాగానే లెజెండ్ పిలిచేశాడు

సినిమా ఇండస్ట్రీలో హిట్ లేదా ఫ్లాప్ కెరీర్ ను డిసైడ్ చేస్తుంటుంది. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ హీరో విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా సూపర్ ఫ్లాప్ అయ్యింది. అప్పటికే రజనీతో జైలర్ సినిమా సన్నాహాల్లో ఉంది. బీస్ట్ ఫ్లాప్ ఎఫెక్ట్ ఈ దర్శకుడి మీద ఎంత పడిందంటే జైలర్ సినిమా నుంచి నెల్సన్ ను తొలగించమని హీరో రజనీకాంత్ కు చాలా మంది చెప్పారట. అయితే ఫలితాలతో కాకుండా దర్శకుడి ప్రతిభను నమ్మిన రజనీ జైలర్ కు నెల్సన్ ను దర్శకుడిగా కొనసాగించారు. ఆ నమ్మకం ఇవాళ రికార్డ్ స్థాయి రిజల్ట్ ను ఇచ్చింది.

జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 450 కోట్ల రూపాయలు రాబట్టి కోలీవుడ్ సినిమాల రికార్డుల తుడిచేసింది. అప్పుడు సినిమా నుంచే తీసేయమన్న దర్శకుడికి అభినందనలు, అవకాశాలు వస్తున్నాయి. తాజాగా హీరో కమల్ హాసన్ ఈ దర్శకుడికి సినిమా ఆఫర్ చేసినట్లు సమాచారం. అప్పుడు ఖైదీ సినిమా రిలీజవ్వగానే దర్శకుడు లోకేష్ మీద కర్చీఫ్ వేశాడు కమల్. లోకేష్ తో కమల్ చేసిన విక్రమ్ భారీ విజయం సాధించింది. ఇప్పుడు జైలర్ దర్శకుడి పైనా అలాంటి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి కమల్ హాసన్ కు. ఏమైనా తమిళ ఇండస్ట్రీలో ఇద్దరు లెజెండ్స్ తో సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నారు నెల్సన్.