గౌతమ్ సినిమా ఎంట్రీ ఎప్పుడు..?

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి రావడం.. స్టార్ హీరోగా సక్సెస్ ఫుల్ గా రాణిస్తుండడం తెలిసిందే. మహేష్‌ బాబు బాల నటుడుగా కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు, అన్నా తమ్ముడు, బాల చంద్రుడు.. తదితర చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్నాడు. మహేష్ వలే.. తనయుడు గౌతమ్ ను కూడా 1 నేనొక్కడినే సినిమాలో బాలనటుడుగా పరిచయం చేశాడు. బాలనటుడుగా మెప్పించిన గౌతమ్ కు నటన పై ఆసక్తి ఉందట. హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. గౌతమ్ సినీ రంగ ప్రవేశం గురించి నమ్రత స్పందించారు. ప్రస్తుతం గౌతమ్ దృష్టి చదువు పైనే ఉందన్నారు. ఇంకో ఆరేడు సంవత్సరాల తర్వాతే సినిమాల్లోకి వస్తాడని చెప్పారు. మరో వైపు మహేష్‌ ముద్దుల కూతురు సితార కూడా నటన పై ఆసక్తి పెంచుకుంది. తనకు సినిమాలంటే ఇష్టమని చెప్పింది. ఆమె ఇప్పటికే వాణిజ్య ప్రకటనలో నటించింది. దానికి గాను వచ్చిన కోటి రూపాయల పాతితోషికాన్ని ఛారిటీ కోసం ఖర్చు చేసినట్టు తెలిపింది. తన తొలి సంపాదనను ఛారిటీ కోసం ఇవ్వడం పై సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందిస్తున్నారు.