ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. అలాగే ఫ్లాపులు, డిజాస్టర్స్ కూడా చూశారు. కమర్షియల్ సినిమాల పక్కన పెడితే మంచి సినిమాలు అందించారు. ఈ మధ్య ఆయన సంస్థకు కొంత బ్యాడ్ టైమ్ నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన గేమ్ ఛేంజర్ అయితే ఫ్లాప్ అయ్యింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు. ఈ సినిమా లాభాలతో మరింత ఉత్సాహంగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థ దిల్ రాజు గురించి ఆర్టికల్స్ రాస్తోంది. అందులో దిల్ రాజు పర్సనల్ విషయాల గురించి.. అలాగే తన ఆఫీస్ లో జరుగుతున్న విషయాల గురించి రాసిందట. అది దిల్ రాజుకు బాగా కోపం తీసుకువచ్చిందట. జనరల్ గా తన గురించి ఏం రాసినా అంతగా పట్టించుకోరు. ఒకవేళ కోపం వస్తే మాత్రం తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తారు. గతంలో ఇలా ఓ వెబ్ సైట్ కు సంబంధించిన జర్నలిస్ట్ కు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు బాగా కోపం రావడంతో ప్రెస్ మీట్ పెట్టాలి అనుకున్నారు. మీడియా దిల్ రాజు అర్జెంట్ ప్రెస్ మీట్ అంటూ సమాచారం అందించారు. అంతలోనే ఏమైందో ఏమో కానీ.. ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశారు.