నిఖిల్ స్పై రన్ టైమ్ ఎంత..?

యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ స్పై. ఈ చిత్రం ద్వారా ఎడిటర్ గ్యారీ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమా పై ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ఈ నెల 29న స్పై మూవీ రిలీజ్ కానుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ద్వారా ఇందులో రానా దగ్గుబాటి నటించిన విషయాన్ని రివీల్ చేసి మరింతగా అంచనాలు పెంచేశారు. ఈ ట్రైలర్ కు అనూహ్య స్పందన వచ్చింది.

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది.

ఇక ఈ మూవీ రన్‌ టైమ్ విషయానికి వస్తే… 135 నిమిషాలు అంటే.. 2 గంటల 15 నిమిషాలు అని సమాచారం. ఇది స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఖచ్చితంగా సరిపోతుంది అని చెప్పాలి. ఈ చిత్రంలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటించింది. ఆర్యన్ రాజేష్, సన్యా ఠాకూర్, మకరంద్ దేశ్‌పాండే, అభినవ్ గోమతం మరియు ఇతరులు సహాయక పాత్రలు పోషించారు. ఈ చిత్ర నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథ అందించడం విశేషం. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చారు. మరి.. కార్తికేయ 2 వలే ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.