7/జి బృందావన కాలనీ అప్పట్లో ఓ సంచలనం. ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ సంచలన విజయం సాధించింది. అయితే.. ఎప్పటి నుంచో ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తారని వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా అయితే ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది. మేటర్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ ఆగస్ట్ చివరి నుంచి స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా సమాచారం.
అయితే.. హీరోగా రవి కృష్ణనే కనిపించనుండగా హీరోయిన్స్ కొత్త వాళ్ళు యాడ్ అవుతారని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాకి సీక్వెల్ అంటే అంచనాలు బాగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగానే కథను రెడీ చేశారట. చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. మొత్తానికి అయితే ఈ సినిమా ఫ్యాన్స్ కి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. మరి.. ఈ సీక్వెల్ ఎలా ఉంటుందో..? ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.