పవన్ ఓజీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఓజీ. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమా ప్రారంభించినప్పటి నుంచి వరుసగా అప్ డేట్స్ ఇచ్చిన మేకర్స్ ఆతర్వాత స్పీడుకు కాస్త బ్రేక్ పడింది. తాజాగా ఓజీ మూవీ ఈ వారం నుండి నాల్గవ షెడ్యూల్ ప్రారంభం కానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

అంతే కాకుండా ఈ తాజా షెడ్యూల్ లో ప్రధాన తారాగణం జాయిన్ అవుతారని తెలిపారు. ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ మరియు మిగిలిన నటీనటుల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలియచేశారు. ఈ భారీ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నారు. కాగా ఈ సినిమాని డిసెంబర్ 2023లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఓజి గురించి మరిన్ని అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నాయి.