ఖుషి ట్రైలర్ టాక్ ఏంటి..?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రంలో విజయ్ కు జంటగా సమంత నటించింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు ఖుషి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. కాశ్మీర్ వెళ్లి కుర్రాడుకి అక్కడ ఓ ముస్లిం అమ్మాయి బేగం కనిపించడం.. లవ్ లో పడడం.. ఆతర్వాత బేగం బేగం కాదు.. బ్రాహ్మిణ్ అని తెలుస్తుంది. ఇక ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుంటారు.

ఆతర్వాతే అసలు కథ స్టార్ట్ అవుతుంది. వీళ్ల లైఫ్ లో ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు వచ్చాయి..? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు అనేదే ఖుషి కథ అని ట్రైలర్ ను బట్టి తెలుస్తుంది. ట్రైలర్ చూస్తుంటే.. అంటే సుందరానికి, సఖి, గీత గోవిందం తదితర సినిమాలు గుర్తొస్తున్నాయి కానీ.. విజువల్స్, సాంగ్స్ అన్నీ చూస్తుంటే.. కుర్రాళ్లకు బాగా నచ్చేట్టు అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి… ఖుషి విజయ్, సమంత, శివ నిర్వాణ ముగ్గురికి ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో..?