‘ఖుషి’ మెయిన్ పాయింట్ ట్రైలర్ లో చూపించలేదు – డైరెక్టర్ శివ నిర్వాణ

లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను సరికొత్తగా తెరపై చూపిస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ సినిమాలు సకుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందించిన కొత్త సినిమా ‘ఖుషి’ మరో మూడు రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ‘ఖుషి’ విడుదలకు రెడీ అవుతున్న సందర్భంగా ఈ సినిమా తెరకెక్కించిన ఎక్సీపిరియన్స్ తెలిపారు డైరెక్టర్ శివ నిర్వాణ.

‘ఖుషి’ మణిరత్నం ‘సఖి’ లాంటి పాయింట్ అనే వార్తలూ వచ్చాయి కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఇవాళ్టి కాంటెంపరరీ సొసైటీలో ఉన్న ఒక ఇష్యూను విజయ్, సమంత లాంటి పాపులర్ స్టార్స్ ద్వారా అడ్రస్ చేయిస్తే బాగుంటుందని నమ్మాను. వాళ్లకూ ఈ పాయింట్ కనెక్ట్ అయ్యింది. ఆ పాయింట్ ఏంటనేది ట్రైలర్ లో మేము చూపించలేదు. థియేటర్ లో చూడాలి. ఈ సినిమా విజయ్ తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత సమంత లాంటి ఫర్ ఫార్మింగ్ హీరోయిన్ ఉంటే సినిమా మరింత స్ట్రాంగ్ అవుతుందని చెప్పి ఆమెను అడిగాం. ఈ సినిమాలో విజయ్ ను లేడీ ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు.

ప్రేమ కథను ఎంత కొత్తగా చెప్పాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్. సమంత షూటింగ్ కోసం ఎంతో కోపరేట్ చేస్తుంది. చాలా డెడికేటెడ్ హీరోయిన్. అలాంటి హీరోయిన్ కు ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మేమంతా సపోర్ట్ చేయకుంటే ఎలా. ఆమె ట్రీట్ మెంట్ మధ్యలో వస్తా అని చెప్పేది కానీ మధ్యలో గ్యాప్ ఇస్తూ షెడ్యూల్స్ చేయడం ఇబ్బందిగా ఉండి..పూర్తిగా నయమైన తర్వాతే రమ్మని చెప్పాం. ‘ఖుషి’ మ్యూజిక్ కోసం హేషమ్ ను కలిసి మాట్లాడినప్పుడు ఆయన మంచి మ్యూజిక్ ఇవ్వగలడని అనిపించింది. విజయ్ కు చెప్పగానే ఆయన కూడా ఓకే అన్నారు. హేషమ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ హిట్. నా రోజా నువ్వే హిందీ సహా అన్ని లాంగ్వేజెస్ లో హిట్టయ్యింది. మ్యూజిక్ కు మంచి పేరొచ్చింది కాబట్టి ఆ మ్యూజిక్ తోనే సినిమా ప్రమోషన్ గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని అనుకుని మ్యూజిక్ కన్సర్ట్ పెట్టాం. ఇది విజయ్ చెప్పిన ఆలోచనే.

విజయ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. పెళ్లి చూపులు, గీత గోవిందంలో ఒకలాంటి కామెడీ టైమింగ్ చూశారు. కానీ ఇందులో స్టైలిష్ కామెడీ చేశాడు. అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు విజయ్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అందరూ ఆయన క్యారెక్టర్ ను ఓన్ చేసుకుంటారు. ‘ఖుషి’ లో హిందూ ముస్లిం మధ్య గొడవలు చూపించడం లేదు. కానీ ఒక వెరీ సెన్సిటివ్ ఇష్యూను కథలో చూపిస్తాం. అది మీకు నచ్చుతుంది. ఒక ప్లెజంట్ ఎట్మాస్పియర్ కోసమే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం. నేనే కాదు ప్రతి దర్శకుడు మైత్రీ వాళ్ల గురించి మంచిగా చెబుతారు. నేను దర్శకుడు మణిరత్నం అభిమానిని. ఆయనలా ఒక్క ఫ్రేమ్ కూడా ఎవరూ పెట్టలేరు. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ వంటి సినిమాలన్నీ మనకు నచ్చేలా చేసుకున్న సినిమాలు. ఇతర భాషల వాళ్లు ఇష్టపడి పాన్ ఇండియా అయ్యాయి. నా దృష్టిలో మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చి పాన్ ఇండియా మూవీ అవుతుంది. ‘ఖుషి’ థియేటర్ లో చూసి ఒక మంచి అనుభూతితో బయటకు వస్తారు.