ఒకవైపు హీరోగా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకుంటున్నారు నవీన్ చంద్ర. ఆయన తెలుగుతో పాటు తమిళంలో పలు సూపర్ హిట్ మూవీస్ వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు. నవీన్ చంద్ర హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “28°C” రేపు థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ మూవీగా రూపొందించారు “పొలిమేర” ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్. “28°C” మూవీ సక్సెస్ పై తామంతా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు హీరో నవీన్ చంద్ర తెలిపారు.
హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ – 28 డిగ్రీల టెంపరేచర్ లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా రూపొందించారు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్లిద్దరు డాక్టర్స్ గా సెటిల్ అవుతారు. అయితే అంజలికి అనారోగ్య సమస్య వల్ల ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్ లోనే చూసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు “28°C” సినిమా చూసి ఇంత మంచి ఎమోషన్, డ్రామా ఉన్న సినిమాను ఎందుకు రిలీజ్ చేయలేదు, నేను రిలీజ్ చేస్తా అని ముందుకొచ్చారు. “28°C” థియేటర్స్ తో పాటు ఏ ప్లాట్ ఫామ్ మీద రిలీజ్ అయినా అందరి ప్రశంసలు పొందుతుంది. అన్నారు