హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటించిన “ఫియర్” సినిమా ఈ నెల 14న థియేటర్స్ లోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సక్సెస్ ఫుల్ టాక్ తో 150కి పైగా థియేటర్స్ లో ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటులు షానీ, అప్పాజీ అంబరీష్, నటి సాహితీ దాసరి, డైరెక్టర్ హరిత గోగినేని, నిర్మాత ఏ ఆర్ అభి, సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ ఏఆర్ అభి మాట్లాడుతూ – మా సినిమాకు రిలీజ్ కు రెండు రోజు ముందే ప్రీమియర్స్ వేశాం. ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. 14న సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా..ముందు రోజు అల్లు అర్జున్ గారి విషయంలో జరిగిన ఘటన మమ్మల్ని బాధపెట్టింది. ఇండస్ట్రీ పర్సన్స్ గా, ఆయన అభిమానులుగా ఇబ్బందిగా ఫీలయ్యాం. అల్లు అర్జున్ గారి విషయంలో మరేదైనా దురదృష్టకరమైనది జరిగితే ఫియర్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేయాలని కూడా అనుకున్నాం. అయితే లక్కీగా అల్లు అర్జున్ గారు బెయిల్ పై బయటకు వచ్చారు. 150 సెంటర్స్ లో ఫియర్ సినిమా రిలీజ్ చేస్తే అన్నిచోట్లా బాగా ఆదరణ లభిస్తోంది. ఒక్క షో కూడా క్యాన్సిల్ కాలేదు. కలెక్షన్స్ బాగున్నాయని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. నాకు హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ హరితకు థ్యాంక్స్. అన్నారు.