“భోళా శంకర్” రిలీజ్ ఆపాలంటూ కోర్టుకెక్కిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త సినిమా భోళా శంకర్ రిలీజ్ ను ఆపాలంటూ కోర్టుకెక్కారు విశాఖపట్నం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ గతంలో నిర్మించిన ఏజెంట్ సినిమా హక్కులను ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకకు 30 కోట్ల రూపాయలు చెల్లింది ఐదేళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకున్నామని అయితే డబ్బు చెల్లించిన తర్వాత ఆ సినిమా విశాఖ హక్కులు మాత్రమే తనకు ఇచ్చారని బత్తుల సత్యనారాయణ అంటున్నారు. సామజవరగమన సినిమా కూడా వైజాగ్ డిస్ట్రిబ్యూట్ చేశామని, అందులో చాలా కొద్ది మొత్తమే తనకు కవరైందని ఆయన చెబుతున్నారు.

మిగిలిన డబ్బుల గురించి అడిగితే తదుపరి సినిమా(భోళా శంకర్ )లో చూసుకుందామని చెప్పారని బత్తుల సత్యనారాయణ చెబుతున్నారు. తాను ఈ విషయాన్ని ఫిలించాంబర్ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. ఈ సాయంత్రం కోర్టు తీర్పును అనుసరించి తదుపరి చర్యలు తీసుకుంటానని బత్తుల సత్యనారాయణ చెబుతున్నారు. ఎల్లుండి భోళా శంకర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.