మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర సంక్రాంతికి రావాలి కానీ రాలేదు. జగదేకవీరుడు అతిలోక సుందరి రిలీజ్ డేట్ మే 9న ఈ సినిమా రిలీజ్ అవుతుందనే టాక్ వినిపించింది. అయితే వీఎఫ్ఎక్స్, ప్రమోషన్ కు కావాల్సింత టైమ్ ఇవ్వాలని, రిలీజ్ ను జూన్ కు పోస్ట్ పోన్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటున్నారట. ఇదే జరిగితే విశ్వంభర కోసం జూన్ వరకు వెయిట్ చేయాల్సిందే.
ప్రస్తుతం విశ్వంభర సినిమాకు మరో వారం పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ బ్యాలెన్స్ వర్క్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చేసిన షూటింగ్ తో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్, పాటలు, ట్రైలర్ వంటి ప్రమోషన్ కు, ఈవెంట్స్ కు ఇంకాస్త టైమ్ తీసుకునేలా ఉంది. అందుకే జూన్ 27న విశ్వంభర రిలీజ్ చేస్తారని టాక్ ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ విశ్వంభరను భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు.