“ఇంద్ర”తో పాటే “విశ్వంభర” టీజర్ స్క్రీనింగ్

ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర(Indra) సినిమా 4కే వెర్షన్ లో రీ రిలీజ్ కాబోతోంది. ఇంద్ర మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి ఈ సినిమా రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. ఇంద్ర 4కే ప్రింట్లతో పాటు చిరంజీవి కొత్త సినిమా విశ్వంభర(Vishwambhara) టీజర్ అటాచ్ చేస్తున్నారట.

ఇంద్రతో పాటే థియేటర్స్ లో విశ్వంభర టీజర్ స్క్రీనింగ్ కానుంది. ఇది మెగాఫ్యాన్స్ ను సంతోషపెట్టే విషయమే. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న విశ్వంభర వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్స్ లోకి రాబోతోంది. యూవీ క్రియేషన్స్ లో దర్శకుడు వశిష్ట ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.