జూలై టార్గెట్ పెట్టుకున్న మెగా మూవీ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ మూవీని జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్సులను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కు మూవీ టీమ్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జూలై చివరి వరకు మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. విశ్వంభర సినిమా సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ కాబట్టి ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకోనుంది.

ఈ సినిమాలో 70 శాతం సీన్స్ లో విజువల్ ఎఫెక్టులను ఉపయోగిస్తున్నట్లు దర్శకుడు వశిష్ట గతంలో చెప్పారు. ఇంత భారీ విజువల్ ఎఫెక్టులు చేయాలంటే టైమ్ పడుతుంది. సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేశారు కాబట్టి షూటింగ్ వీలైనంత త్వరగా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లబోతున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఈషా చావ్లా, సురభి ఇతర కీ రోల్స్ చేస్తున్నారు.