ఐపీఎస్ ఆఫీసర్ గా విశ్వక్ సేన్

హీరో విశ్వక్ సేన్ (Vishwaksen) తన కొత్త సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ మూవీ రీసెంట్ గా మొదలైంది. ఈ చిత్రాన్ని దసరా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. శ్రీధర్ గంటా అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వీఎస్ 13 (VS 13)అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పోలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుంది. కన్నడ హీరోయిన్ సంపద (Sampada) వీఎస్ 13 మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ చేస్తున్నారు.