సినిమాలు ఆలస్యమవడం చూస్తుంటాం గానీ మరీ 12 ఏళ్ల పాటు రిలీజ్ లేట్ కావడం వింతే. విశాల్ సినిమా మదగజరాజా సినిమాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. జెమిని ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో దర్శకుడు సుందర్ సి మదగజరాజా సినిమాను 2012లో రూపొందించారు. 2013 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే అనివార్య కారణాలతో సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.
చివరకు ఇన్నేళ్ల తర్వాత ఈ సంక్రాంతికి మదగజరాజా సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్స్ గా నటించారు. అప్పటి సినిమా పోస్టర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 12 ఏళ్ల తర్వాత రిలీజ్ కు ఈ ఓల్డ్ కంటెంట్ మూవీ ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.