“విరాజి” బ్రేక్ ఇస్తుంది అంటున్న వరుణ్ సందేశ్

ఇటీవల “నింద” (Ninda) మూవీతో మంచి సక్సెస్ అందుకున్న హీరో వరుణ్ సందేశ్ (Varun sandesh) తన కొత్త సినిమా “విరాజి” (Viraji) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల (mahendranath kundla) నిర్మిస్తున్నారు. విరాజి చిత్రంతో ఆద్యంత్ హర్ష (adhyanth harsha) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 2న రిలీజ్ కు వస్తోంది. “విరాజి” టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆసక్తి కలిగించేలా ఉంది. ఈ సినిమా గురించి

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – విరాజి నేను నా 17 ఏళ్ల కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ మూవీ. అలాంటి మోస్ట్ క్రేజియెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10వ తేదీన విరాజి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. మీరు చూడగానే సర్ ప్రైజ్ అవుతారు. ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది. నేను విరాజి మూవీ రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. మా ప్రొడ్యూసర్ మహేంద్ర నాకు బ్రదర్ లాంటి వారు. ఈ మూవీని ప్రేక్షకుల దగ్గరకు బాగా రీచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విరాజి సినిమాకు పనిచేసిన వారంతా ప్యాషన్ తో వర్క్ చేశారు. మా సినిమా కు మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.