విక్రమ్ సినిమా షోస్ క్యాన్సిల్

విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వీర ధీర శూరన్ 2 న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఈ సినిమా లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదంతో సినిమా రిలీజ్ చాలా చోట్ల ఆగిపోయింది. వీర ధీర శూరన్ సినిమా మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఓటీటీ రైట్స్ విషయంలో ఏర్పడిన వివాదంతో ఓ నిర్మాణ సంస్థ ఢిల్లీ కోర్టుకు వెళ్లింది. న్యాయస్థానం సినిమా విడుదలను కొన్ని గంటల పాటు వాయిదా వేయాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో యూఎస్ ప్రీమియర్స్ తో పాటు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో వీర ధీర శూరన్ 2 సినిమా రిలీజ్ వాయిదా వేశారు. తంగలాన్ తర్వాత విక్రమ్ నటించిన చిత్రమిదే. ఈ సినిమాకు ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. దుషారా విజయన్ హీరోయిన్ గా నటించింది. రెండు పార్టుల ఈ సినిమాను ఫస్ట్ సెకండ్ పార్ట్ వీర ధీర శూరన్ 2 రిలీజ్ చేస్తుండటం విశేషం.