సల్మాన్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న కోలీవుడ్ హీరో విజయ్

రీజనల్ ఫిల్మ్స్ కు రీజనల్ స్టార్స్ కు ఒకప్పుడు నేషనల్ వైడ్ పెద్దగా వ్యాల్యూ ఉండేది కాదు. ఇప్పటి పాన్ ఇండియా ట్రెండ్ లో ప్రాంతీయ హీరోలే బాలీవుడ్ లోనూ బాక్సాఫీస్ రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నారు. ఎక్కువ క్రేజ్ తోపాటు ఎక్కువ సంపాదిస్తున్నారు మన సౌత్ హీరోలు. ఇందుకు రీసెంట్ గా ఎగ్జాంపుల్ ఇచ్చింది ఫార్చ్యూన్ ఇండియా(Fortune india) సంస్థ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman khan) కంటే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) ఎక్కువ ట్యాక్స్ కట్టడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

సల్మాన్ ఖాన్ ఈ ఏడాదికి 75 కోట్ల రూపాయల ట్యాక్స్ కడితే విజయ్ 80 కోట్ల రూపాయలు చెల్లించాడు. సౌత్ లో విజయ్ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే మొత్తం సౌత్ నుంచి బాలీవుడ్ హీరోలతో విజయ్ ఒక్కటే పోటీ పడుతున్నాడు. దేశంలోని సెలబ్రిటీల లిస్ట్ చూస్తే హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ గా ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు షారుఖ్ ఖాన్(Sharukh khan). షారుఖ్ 92 కోట్ల రూపాయల వార్షిక పన్ను చెల్లించారు. తెలుగు నుంచి అల్లు అర్జున్(Allu arjun) ఏడాదికి 14 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టినట్లు ఫార్చ్యూన్ ఇండియా సంస్థ పేర్కొంది.