విజయ్ హీరోగా నటించిన లియో సినిమా ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యింది. ఈ నెల 30న చెన్నైలో గ్రాండ్ గా లియో ఆడియో రిలీజ్ వేడుక జరగాల్సిఉండగా..దాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 7 స్టూడియోస్ ట్వీట్ చేసింది. ఈ ఆడియో ఫంక్షన్ రద్దుకు రాజకీయ కారణాలు ఏవీ లేవని ఆ సంస్థ చెబుతున్నా…పొలిటికల్ రీజన్స్ ఉండొచ్చనే సందేహాలు వెలువడుతున్నాయి.
లియో ఆడియో ఫంక్షన్ రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ఇచ్చిన ప్రకటనలో…పాసుల గురించి ఎక్కువ రిక్వెస్టులు వస్తున్నాయి. మా అంచనా కంటే భారీ సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమానికి రావొచ్చు. వారిని కంట్రోల్ చేయలేమనే సందేహంతోనే ఆడియో ఫంక్షన్ చేయడం లేదు. అని పేర్కొంది. ఇటీవల ఏఆర్ రెహమాన్ కన్సర్ట్ కూడా ఇలాగే గందరగోళంగా మారింది. చాలా మందికి గాయాలు అయ్యాయి. ఈ కేసు పోలీసు అధికారుల సస్పెన్షన్ కు దారి తీసింది.
పొలిటికల్ గా విజయ్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో లియో ఫంక్షన్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. లియో సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా..త్రిష హీరోయిన్ గా నటించింది. లియో తెలుగులోనూ ఈ దసరా పండుగకు గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.