విజయ్ సేతుపతి (Vijay sethupathi) సినిమాల్లో రిచ్ కంటెంట్ ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఆయన హీరోగా నటించిన 50వ సినిమా మహారాజ (maharaja) గత నెల థియేటర్స్ లోకి వచ్చి తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్నట్లు తెలుస్తోంది.
తను పెంచుకున్న కూతురిపై అత్యాచారం చేసిన కొందరు దుర్మార్గులపై ప్రతీకారం తీర్చుకున్న తండ్రి కథే మహారాజ. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు స్వామినాథన్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ (mamata mohandas), అభిరామి (Abhirami), భారతీరాజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో నిర్మాత ఎన్వీ ప్రసాద్ (Nv prasad) మహారాజ మూవీని రిలీజ్ చేసిన భారీ లాభాలు ఆర్జించారు.