వైరల్ పిక్స్ – ట్రెండీ రౌడీ సమ్మర్ డ్రెస్ లో విజయ్ దేవరకొండ

స్టైలిష్ మేకోవర్ తో ఆకట్టుకుంటారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన తన రౌడీ బ్రాండ్ వేర్ లో ఫ్యాషన్ గోల్స్ ఇస్తుంటారు. సమ్మర్ రౌడీ వేర్ లో విజయ్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కొత్త సినిమా కింగ్ డమ్ లేటెస్ట్ షెడ్యూల్ కోసం ఆయన శ్రీలంక వెళ్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో విజయ్ దేవరకొండ ఉన్నప్పటి స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీలంకలో పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో లవ్ సాంగ్స్ చిత్రీకరించబోతున్నారు. ఈ పాటల కోసం మంచి ట్యూన్స్ రెడీ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. కింగ్ డమ్ సినిమా మే 30న రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటినుంచే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన “కింగ్ డమ్” టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఏఐతో వీడియోతో రిలీజ్ చేసిన టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST)కు కూడా భారీ స్పందన వచ్చింది.