“ఖుషి”పై జరుగుతున్న కుట్రలపై ఫైట్ కు రెడీ అవుతున్న హీరో విజయ్ దేవరకొండ

గతంలో రెండు మూడు వెబ్ సైట్స్ మీద హీరో విజయ్ దేవరకొండ లేవనెత్తిన అంశాలు టాలీవుడ్ లో సంచలనం సృష్టించాయి. ఫేక్ న్యూస్ కు వ్యతిరేకంగా విజయ్ ఇచ్చిన పిలుపునకు స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున వంటి ఎందరో ముందుకొచ్చి విజయ్ కు సపోర్ట్ గా నిలిచారు. అలాంటి కొన్ని శక్తులు మళ్లీ విజయ్ దేవరకొండ సినిమాలను టార్గెట్ చేస్తున్నాయి. ఈ కుట్రలు నిజమేనంటూ కొన్ని పేరున్న మీడియా సంస్థలు, వెబ్ సైట్స్ కూడా ఆర్టికల్స్ రాస్తున్నాయి. తన సినిమాలపై జరుగుతున్న కుట్రల గురించి సందర్భం చూసి మాట్లాడతానంటూ నిన్నటి వైజాగ్ ఖుషి సక్సెస్ మీట్ లో విజయ్ చెప్పడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇలాంటి ఫేక్ రివ్యూస్, రేటింగ్స్, యూట్యూబ్ వీడియోలు చేయిస్తున్న వారిని విజయ్ మరోసారి ఉతికి ఆరేసేలా ఉన్నాడని అంటున్నారు.

వైజాగ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తోంది. నేను ఇంట్లో ఉన్నా ఆ ప్రేమను ఫీలవుతున్నా. నా మీద, నా సినిమా మీద అటాక్స్ జరుగుతున్నాయి. మా ఖుషి మీద ఫేక్ బీఎంఎస్ రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. వేలాది ఫేక్ అక్కౌంట్స్ క్రియేట్ చేసి, యూట్యూబ్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇందుకు కొందరు డబ్బులు ఖర్చు చేయిస్తున్నారు. అవన్నీ దాటుకుని అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ నెంబర్స్, సక్సెస్ అందుకుంటున్నాం. మీరే ఈ విజయానికి కారణం. అన్నారు.

విజయ్ దేవరకొండ తనకు తానుగా చిన్నస్థాయి నుంచి స్టార్ గా ఎదిగిన హీరో. అలాంటి హీరో సినిమాలు సక్సెస్ అయితే కుట్రలు చేయడం ఎవరూ అంగీకరించరు. సపోర్ట్ చేయరు. అందుకే విజయ్ మరోసారి బయటకు వచ్చి ఈ విషయంపై మాట్లాడితే ఇండస్ట్రీ నుంచి ఆయనకు స్టార్ హీరోల నుంచి మద్ధతు లభించడం ఖాయం. విజయ్ కాదు మరెవరైనా వాళ్లెంతో కష్టపడి చేసిన సినిమాపై బురద జల్లడాన్ని ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయదు.