ట్రెండ్ క్రియేట్ చేస్తున్న విజయ్ దేవరకొండ “కింగ్ డమ్” మేకర్స్

ప్రపంచాన్ని ఊపేస్తున్న కొత్త టెక్నాలజీ ఏఐ. ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్ చేశారు కింగ్ డమ్ మూవీ మేకర్స్. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ టీజర్ ఓఎస్ టీ వీడియో వైరల్ అవుతోంది. ఐఏ టెక్నాలజీతో కింగ్ డమ్ టీజర్ ఓఎస్ టీ వీడియో క్రియేట్ చేశారు. ఏఐ టెక్నాలజీతో ఈ వీడియో క్రియేట్ చేయడం ద్వారా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు కింగ్ డమ్ సినిమా మేకర్స్.

విజయ్ దేవరకొండ కెరీర్ లో ప్రెస్టీజియస్ గా రూపొందుతోంది కింగ్ డమ్ మూవీ. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. మే 30న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. కింగ్ డమ్ మూవీపై మూవీ లవర్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. టీజర్ కు యూట్యూబ్ లో వచ్చిన భారీ వ్యూస్ ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ ను చూపిస్తున్నాయి.