రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు

హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “వీడీ 12” మూవీకి “కింగ్ డమ్” టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు టీజర్ రిలీజ్ చేశారు. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ “కింగ్ డమ్” టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ తో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. మే 30న “కింగ్ డమ్” వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

“కింగ్ డమ్” టీజర్ ఎలా ఉందో చూస్తే – శ్రీలంక తీర ప్రాంతంలో ఎడతెగని ఓ యుద్ధం జరుగుతుంటుంది. రక్తం ఏరులై పారుతుంది. అలసట లేని ఈ యుద్ధం ఏం కోరుకుంటోంది అనేది టీజర్ లో ఆసక్తి కలిగించింది. వలసపోయినా, అలసిపోయినా ఆగపోనిదీ మహారణం, ఈ అలజడి ఎవరి కోసం, ఇంత భీభత్సం ఎవరి కోసం, అసలీ వినాశనం ఎవరి కోసం..రణ భూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం అంటూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ వాయిస్ తో టీజర్ ఆకట్టుకుంది. ఇప్పటిదాకా కనిపించని కొత్త మేకోవర్ లో విజయ్ దేవరకొండ కనిపించారు. పోలీస్ గా పరిచయం చేసిన విజయ్ ఖైదీ ఎందుకు అయ్యారు అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఏమైనా చేస్తా సార్, అవసరమైతేే మొత్తం తగలబెట్టేస్తా అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ టీజర్ కు హైలైట్ గా నిలుస్తోంది.