స్వార్థ రాజకీయాలపై పోరాడే “హిట్లర్”

హిట్లర్(Hitler) సినిమా టైటిల్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఇదే పేరుతో హీరో విజయ్ ఆంటోనీ(Vijay antony) సినిమా చేస్తున్నాడు. మెగాస్టార్ హిట్లర్ చెల్లెల్ల కోసం ఆరాటపడితే విజయ్ ఆంటోనీ హిట్లర్ స్వార్థ రాజకీయాలపై పోరాటం చేస్తున్నాడు. కొత్త తరహా సినిమాలు చేసే విజయ్ ఆంటోనీ ఈసారి “హిట్లర్” సినిమాతో బ్యాడ్ పాలిటిక్స్ వల్ల సొసైటీ ఎదుర్కొంటున్న ఇష్యూస్ ను చూపించబోతున్నారు.

“హిట్లర్” సినిమాను చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్(Chendur Film international) నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. “హిట్లర్” సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన(Dhana) రూపొందిస్తున్నారు. “హిట్లర్” సినిమా ఈ నెల 27న హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పొలిటికల్ డ్రామా, యాక్షన్, లవ్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో “హిట్లర్” ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.