ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోనీ “తుఫాన్” మూవీ ట్రైలర్

ఎమోషనల్, ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ చేయడంలో హీరో విజయ్ ఆంటోనీ (Vijay antony) ఎప్పుడూ తన ప్రత్యేకత చూపిస్తుంటాడు. ఆయన ఇతర జానర్ లో చేసిన సినిమాలు ఆదరణ పొందకపోవచ్చు గానీ ఎమోషనల్ కంటెంట్ తో చేసిన మూవీలు సూపర్ హిట్స్ అయ్యాయి. అలాంటి మరో సినిమాను “తుఫాన్” (Toofan) పేరుతో మన ముందుకు తీసుకొస్తున్నాడు విజయ్ ఆంటోనీ. వచ్చే నెల ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వస్తుండగా..ఈ రోజు ట్రైలర్ (Toofan trailer) విడుదల చేశారు.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటోంది. ఎ‌వరూ తెలియని ప్రాంతంలో తనను ఎవరూ గుర్తుపట్టకుండా హీరో నివసించడం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. అతని గతమేంటి అనేది సినిమాలోనే చూడాలి. దర్శుకడిగా విజయ్ మిల్టన్ స్పెషల్ ఫిలిం మేకింగ్ ట్రైలర్ లో కనిపించింది. అందమైన లొకేషన్స్ లో విజువల్స్ ఇంప్రెస్ చేశాయి. విజయ్ ఆంటోనీ యాక్షన్, పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది.

“తుఫాన్” సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్ (Vijay milton).