చిరంజీవి టైటిల్ తో వస్తున్న విజయ్ ఆంటోనీ

హీరో విజయ్ ఆంటోనీ అంటే కొత్తదనానికి మారుపేరు. ఆయన సినిమాలన్నీ వైవిధ్యంగా ఉంటూ ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుంటాయి. విజయ్ ఆంటోనీ చేస్తున్న అలాంటి మరో ప్రయత్నమే “హిట్లర్”. ఈసారి మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తో వస్తున్నారు విజయ్ ఆంటోనీ. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా ఈ సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. హిట్లర్ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ట్రైన్ జర్నీలో ఉన్న హీరో విజయ్ ఆంటోనీ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ ను ఎదుర్కొన్నట్లు మోషన్ పోస్టర్ లో చూపించారు. ఇదే ట్రైన్ లో హీరోయిన్ రియా సుమన్ హీరో కలుసుకుంటాడు. గన్ పేలుస్తోన్న గౌతమ్ మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. మోషన్ పోస్టర్ లో విజయ్ ఆంటోనీ ఫ్రెష్ లుక్ లో ఉన్నారు. చివరలో ఆయన జోకర్ గెటప్ లో కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ట్రైన్ జర్నీ నేపథ్యంగా రూపొందించిన మోషన్ పోస్టర్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ పౌరుడి కథే హిట్లర్. హిట్లర్ ఒక పేరు కావొచ్చు కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్య పరిస్థితుల్లో ఆ పేరు నియంతలకు మారుపేరుగా మారింది. అందుకే సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ అనుకున్నాం అని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న హిట్లర్ మూవీని త్వరలో పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళ,తెలుగు,మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.