పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసిన కోలీవుడ్ స్టార్ విజయ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త రాజకీయ పార్టీని అనౌన్స్ చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో ఆయన పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. విజయ్ రాజకీయ పార్టీ అనౌన్స్ చేయడం తమిళనాట సంచలనంగా మారింది. గత కొద్ది రోజులుగా విజయ్ తండ్రి ఈ పార్టీ కార్యకలాపాలు చేస్తున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ మొదలు అభిమానులతో సమావేశాలు నిర్వహించడం వంటి పనులు నిర్వహిస్తున్నారు.

నిన్న విజయ్ కూడా తన అభిమాన సంఘాలతో సమావేశం కావడంతో రాజకీయ పార్టీ ప్రకటన అనివార్యమే అంటూ వార్తలు వచ్చాయి. ఇవాళ తన పార్టీని స్థాపిస్తున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. ఏప్రిల్, మేలో వస్తున్న సార్వత్రిక లోక్ సభ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేయడం లేదని, రాజకీయ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని విజయ్ తెలిపారు. ఇప్పుడున్న ఏ పార్టీకి తమ పార్టీ మద్ధతు ఇవ్వదని చెప్పారు.