కోలీవుడ్ హీరో విజయ్ చివరి సినిమాగా చేస్తున్న 69వ చిత్రానికి జన నాయగన్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ను చూసినట్టైతే.. లక్షలాది జన సమూహం చూస్తుండగా.. వాళ్ళతో సెల్ఫీ తీసుకుంటున్న హీరో విజయ్ స్టిల్ ద్వారా కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. తమిళనాడులోనే కాక బయట రాష్ట్రాల్లో కూడా విజయ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. పైగా విజయ్ లాస్ట్ మూవీ కావడంతో ఈ సినిమా పై అంచనాలు మాములుగా లేవు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు ఒక కీలక పాత్ర పోషిస్తోంది.
ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ఉంది. ఇటీవల అనిల్ రావిపూడి కూడా భగవంత్ కేసరి రీమేక్ విషయమై.. తనని కాంటాక్ట్ చేసిన విషయం నిజమే అని చెప్పడంతో భగవంత్ కేసరి రీమేక్ నే విజయ్ చేస్తున్నాడని అనుకుంటున్నారు. అయితే.. విజయ్ పోస్టర్ చూశాక ఇది వేరే కథతో రూపొందుతోన్న సినిమా ఏమో అనే సందేహం కలుగుతోంది. అయితే.. అంత తేలిగ్గా రీమేక్ కాదని వెంటనే తేల్చలేం. ఎందుకంటే.. దర్శకుడు హెచ్ వినోద్ మార్పులు చేర్పులు చేయడంలో చాలా నేర్పరి. బాలీవుడ్ పింక్ ని అజిత్ ఇమేజ్ కి తగ్గట్టు కమర్షియల్ కోటింగ్ ఇచ్చి నెర్కొండ పార్వైగా మలచిన తీరు పెద్ద సక్సెస్ ఇచ్చింది. సో.. జన నాయగన్ ఇప్పటికిప్పుడు ఏ కథనేది కనీసం టీజర్ వస్తే కానీ చెప్పలేం. ముప్పాతిక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు.