వెంకీ మామ స్టార్ట్ చేశాడు

వెంకటేష్ (Venkatesh) హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి (Anil ravipudi) రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా షూటింగ్ బిగిన్ చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు (Dil raju) నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి వెంకటేష్ కలిసి ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత చేస్తున్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఒక మాజీ పోలీస్ అధికారి, అతని మాజీ ప్రేయసి, మాజీ భార్య మధ్య సాగే ఎంటర్ టైనర్ ఇది. నేటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో సినిమాను కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోంది. భగవంత్ కేసరి సక్సెస్ తో ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి ఈ కొత్త సినిమాతో మరో సక్సెస్ పై కన్నేశాడు.