విక్టరీ వెంకటేష్ (Venkatesh), అనిల్ రావిపూడి (Director anil ravipudi) కాంబో సినిమా ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఎఫ్ 2 (F2 ), ఎఫ్ 3 (F3) తర్వాత వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని దిల్ రాజు (Dil raju) సమర్పణలో శిరీష్ నిర్మించనున్నారు. ముహూర్తం షాట్‌కు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేయగా, గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు.
డైరెక్టర్ రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మాజీ పోలీస్ అధికారి, అతని మాజీ ప్రేయసి, మాజీ భార్య ..ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే క్రైమ్ ఎంటర్ టైనర్ చిత్రమిది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi chowdary), ఐశ్వర్య రాజేష్ (Ishwarya rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడిగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.